అయ్యప్ప శరణు ఘోషతో మారుమ్రోగిన వెంకటాపురం
అయ్యప్ప శరణు ఘోషతో మారుమ్రోగిన వెంకటాపురం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప మందిరంలో గురువారం రాత్రి అయ్యప్ప స్వాము ల పడిపూజ కార్యక్రమం అయ్యప్ప శరణు ఘోషతో గురు స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా గురువారం మధ్యాహ్నం శ్రీ అయ్యప్ప స్వాములకు స్వామివారి భిక్షా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మాలధారణ భక్తులతో పాటు, సివిల్ స్వాముల భక్తులకు ధనపనేని నాగరాజు దంపతులు స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండలం తో పాటు చుట్టుపక్కల ఉన్న అయ్యప్ప స్వాములు కూడ పెద్ద సంఖ్య లో హాజరై స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు. రాత్రి పడిపూజ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి మాల ధారణ భక్తులు పాల్గొని స్వామియే శరణమయ్యప్ప అనే నామ స్మరణలతో పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇష్టపూర్వకమైన ప్రసాదా లను నైవేద్యంగా గురు స్వాములు సమర్పించి భక్తులకు పంపిణీ చేశారు.