వెంకటాపురం తాసిల్దార్ బదిలీ
– నూతన తాసిల్దార్ గా వేణుగోపాల్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం తాసిల్దారు లక్ష్మీ రాజయ్య బదిలీ కాగా ఆయన స్థానంలో కన్నాయిగూడెంలో తాసిల్దారుగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ వెంకటాపురం తాసిల్దార్ గా మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న పి. లక్ష్మీ రాజయ్యను భూపాలపల్లి జిల్లాకు బదిలి చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బదిలీల ప్రక్రియలో భాగంగా తాసిల్దార్ లో బదిలీలు జరిగినట్లు సమాచారం.