వెంకటాపురం గ్రామీణ వికాస్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫిషర్ గోపాల్ బదిలీ.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ బ్రాంచి ఫీల్డ్ ఆఫిషర్ గోపాల్ రంగారెడ్డి జిల్లా కు బదిలీ అయ్యారు. ఈ మేరకు బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు అంతా బ్యాంకు క్షేత్రాధికారి ఘనంగా సన్మానిం చారు. వెంకటాపురం మండలంలో ఫీల్డ్ ఆఫిషర్ గా మూడు సంవత్సరాలు రైతులకు, ఖాతాదారులకు, స్వయం సేవక మహిళా సంఘాలకు బ్యాంకు నిభందనల ప్రకారం విశేష సేవలు అందించారు. డ్వాక్రా రుణాలు, రైతుల పంట రుణాలు, ఇలాంటి ఎన్నో బ్యాంకు సేవలు ప్రజల కు అందించారని కొనియాడారు.ప్రతి గ్రామం తో సంబంధాలు పెంచుకొని,రణాల రికవరి ,నూతనరుణాల మంజూరు తదితర బ్యాంకు సేవలపై ఖాతాదారులకు అవగాహన కల్ఫించి మంచి పేరు తెచ్చుకొన్నారు. ఎ.పి.జి.వి.బి స్టాఫ్, బ్యాంక్ సీఎస్పీ, ఐకేపీ, వి.ఓ.ఎస్ సిబ్బంది ఫీల్డ్ఆఫీసర్ గోపాల్ కు ఘనంగా సన్మానం చేశారు. ఈకార్యక్రమంలో గ్రామీణ వికాస్ బ్యాంకు మేనేజర్ సతీష్, బ్యాంకు క్యాషియర్ రాజేష్, అటెండర్ చంద్రం, బ్యాంకు సి. ఎస్ .పి. ప్రశాంత్, స్వరూప, పుష్ప, రామకృష్ణ, ఐ.కె.పి. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.