అయ్యప్ప స్వామి నామస్మరణలతో మారుమోగిన వెంకటాపురం.
– ఇరుముడితో శబరిమలై తరలి వెళ్ళిన అయ్యప్ప స్వాములు.
– సాగనంపిన బంధువులు, భక్తులు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురం లో శ్రీ అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం బుధవారం వెంకటాపురంలోనిశ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో గురు స్వాముల ఆశీర్వాదాల తో ఇరుముడుల కార్యక్రమం ఘణంగా జరిగింది.స్వామియే శరణ మయ్యప్ప అనే నామధేయంతో ఇరుముడి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అయ్యప్ప మాల ధారణ భక్తులు అయ్యప్ప స్వామి ఆల యం వద్ద నుండి, ప్రధాన వీధి గుండా, సన్నాయి మేళాలు, వాయి ద్యాల మధ్య స్వామియే శరణమయ్యప్ప అంటూ ఇరుముడుల తో వెంకటాపురం శివారులో ఉన్న శ్రీ ఉమా రామలిం గేశ్వర స్వామి వారి ఆలయం వరకు తరలి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని శివాలయం నుండి వారి వాహనాల్లో తరలి వెళ్లారు. రాంబాబు గురు స్వామి హారతి ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి శబరిమలై, ఇతర దేవాలయాలకు వెళ్లే అయ్యప్ప స్వాముల వాహనాలకు పూజలు నిర్వహించి, స్వామియే శరణమయ్యప్ప అంటూ, అయ్యప్ప మాల ధారణ స్వాములు బంధువులు, స్వామివారి నామధేయంతో వారి, వారి వాహనాలలో సాగ నంపారు. శ్రీ అయ్యప్ప స్వాములు ఇరు ముడి కార్యక్రమాల సందర్భంగా వెంకటాపురం పట్టణంలో స్వామి యే శరణమయ్యప్ప అనే నామస్మరణతో భక్తి రస కార్యక్రమం స్వామివారి నామంతో మార్మోగింది. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.
1 thought on “అయ్యప్ప స్వామి నామస్మరణలతో మారుమోగిన వెంకటాపురం.”