12న వెంకటాపురం మండల ప్రజా పరిషత్ సమావేశం.
12న వెంకటాపురం మండల ప్రజా పరిషత్ సమావేశం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురం మండల ప్రజా పరిషత్ సమావేషాన్ని ఈనెల 12న నిర్వహిం చనున్నట్లు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి ఏ. బాబు ఒక అధికారిక ప్రకటనలో మీడియాకు తెలిపారు. 12వ తేదీన జరిగే మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు,సిబ్బంది విధిగా పాల్గొనాలని, ఆయా శాఖల ప్రగతి ని వేదికలతో హాజరు కావాలని కోరారు. అలాగే ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, ఎంపీపీ విధిగా హాజరు కావాలని ఆహ్వానం పంపినట్లు తెలిపారు.