వెంకటాపురం మండల సిపిఐ మహాసభ సమావేశం

Written by telangana jyothi

Published on:

వెంకటాపురం మండల సిపిఐ మహాసభ సమావేశం

– పార్టీ మండల కార్యదర్శి గా కట్ల రాజు ఎన్నిక

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల భారత కమ్యూనిస్టు పార్టీ మండల శాఖ సమావేశం బుధవారం సీనియర్ నాయకులు గడ్డం రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావే శంలో సిపిఐ వెంకటాపురం మండల ప్రధాన కార్యదర్శిగా కట్ల రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అలాగే మండల కార్యవర్గాన్ని, పార్టీ అనుబంధ సంఘాలను కూడా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సంబంధిత మహాసభ నూతన కమిటీ ఎన్నిక, పార్టీ తీర్మానాలను ముఖ్య అతిథిగా పాల్గొన్న ములుగు జిల్లా సిపిఐ కార్యదర్శి తోట మల్లికార్జున రావు బుధవారం మీడియాకు విడుదల చేశారు. మహాసభను జయప్రదం చేసినటువంటి మండలంలోని గ్రామ శాఖల నుండి వచ్చినటు వంటి సీపీఐ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. నూతన మండల కమిటీలో 29 మందిని కమి టీ సభ్యులుగా, మండల కార్యవర్గాన్ని 11 మందితో ఎన్ను కోవడం జరిగిందని తెలిపారు. సమావేశంలో మండల కార్య దర్శిగా కట్ల రాజును ఏకగ్రీవంగా ఎన్నుకోగా కార్యకర్తల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు, కార్మికులకు, తదితర శ్రామిక వర్గాలకు, ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాగ్దా నాల్ని నెరవేర్చటంలో ప్రభుత్వాలు ఉదాసీన వైఖరి అవలంబి స్తున్నాయని అన్నారు. రేషన్ బియ్యం సక్రమంగా ఇవ్వటం లేదని అన్నారు. హామీలు అమలు చేయడంలో ప్రభుత్వాలు వెనకడుగు వేస్తున్నాయని ఆరోపించారు . పొత్తులో భాగస్వా ములైనటువంటి పార్టీల నమ్మకాన్ని నెరవేర్చాలని కోరారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇంతవరకు ఇవ్వటంలో వైపల్యం చెందారని విమర్శించారు. ధరణిలో లోపాలు సరి చేయక పోతే ఆయా కుటుంభాలలో మధ్య ఇబ్బందులు ఏర్పడి తగాదాలతో కోర్టులకు ఎక్కే పరిస్థితి ఉందని తెలిపారు. ఇళ్ల స్థలాలు ఉన్న ఎస్సీలకు, ఎస్టీలకు మిగతా కమ్యూనిటీకి ఐదు లక్షలు ఇచ్చి, ఇంటి నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీజనల్ వ్యాధులు, వ్యాప్తి చెందుతున్నాయని, వర్షా ల వల్ల ప్రజల్లో దోమలు తాకిడి ఎక్కువ అయి, జ్వరాల బారి న పడేటువంటి పరిస్థితి ఉందన్నారు. సమావేశంలో నాయకు లు గడ్డం రామకృష్ణ,బొల్లి వెంకటలక్ష్మి, సండుగొండ రమేష్, తాటీ సత్యం,కణుకు ముత్తయ్య, కల్లూరు గోపాల్, పొలం కొండయ్య,ధర్ర గోపి, తాటి నారాయణ తదతరులు పాల్గొన్నా రు. నూతన మండల పార్టీ కార్యదర్శి కట్ల రాజు తీర్మానాలను ప్రవేశపెట్టగా, మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now