మలేషియా కంట్రీ కి వెళ్ళిన వెంకటాపురం ఫెర్టిలైజర్స్, ఫెస్టీ సైడ్స్ డీలర్లు

మలేషియా కంట్రీ కి వెళ్ళిన వెంకటాపురం ఫెర్టిలైజర్స్, ఫెస్టీ సైడ్స్ డీలర్లు

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రం చెందిన ఎరువులు పురుగుమందుల ఆథరైజ్డ్ డీలర్లు, ఓజోన్ ఆర్గానీక్ కంపెనీ ఆఫర్తో మలేషియా దేశంలోని వివిధ ముఖ్యమైన ప్రాంతాలలో పర్యటించేందుకు తరలి వెళ్లారు. ఓజోన్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో, ఆర్థరైజ్ డ్ ఎరువులు, పురుగు మందుల డీలర్లను ఎంపిక చేసి మలేషియా దేశంలో ఆరు రోజులు పాటు పర్యటించేందుకు విమానా చార్జీలు, ఇతర ఖర్చులన్నీ ఓజోన్ కంపెనీ ఆఫర్తో తరలి వెళ్లారు. ఈ మేరకు పూర్తి స్తాఇ వీసా లతో ఆదివారం సాయంత్రం ఈ ప్రాంతం నుండి బయలుదేరి, హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి మలేషియాకు చేరుకున్నట్లు సమాచారం. అలాగే వాజేడు మండలంలోని చండ్రు పట్ల , చెరుకూరు, మరియు భద్రాచలం నియోజకవర్గం లోని చర్ల ఇతర ప్రాంతాలకు చెందిన ఎరువులు, పురుగుమందుల డీలర్లు సైతం ఓజోన్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆఫర్పై మలేషియా దేశానికి సుమారు 40 మందికి పైగా కంపెనీ తరఫున తరలి వెళ్ళినట్లు తెలిసింది. ఈ మేరకు మలేషియా దేశ సంస్కృతి, సాంప్రదాయాలు అక్కడ నడవడికలు ఇతర అంశాలపై ఎరువులు, పురుగు మందుల డీలర్లు తమ తమ స్టేటస్లలో మలేషియా దేశం నుండి బంధు,మిత్రులకు పోస్ట్ చేశారు.పూర్తి గా విహారయాత్ర గా మరో నాలుగు,అఇదు రోజుల్లో మలేషియా టూర్ ముగించు కొని ఇండియాకు తిరిగి రానున్నట్లు సమాచారం. ఏజెన్సీ నుండి గగనతలం లో మలేషియా దేశాన్ని సందర్శించడం పట్ల, పలువురు వారికి అభినందనలు తెలిపారు.