ఉప ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వెంకటాపురం కాంగ్రెస్ నేతలు.
తెలంగాణా జ్యోతి, వెంకటాపురం నూగూరు : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు శనివారం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే తమ కుటుంబం అంటూ, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజానాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అని నేతలు కొనియాడుతూ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.పి.పి. ఉపాథ్యక్షులు సయ్యద్ హుస్సేన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకటాపురం సొసైటి చైర్మన్ చిడెం మోహన్ రావు, నేతలు చిడెంశివ ,రమేష్ , నాగరాజు, పలువురు అశేష నాయకులు , కార్యకర్తలు, పార్టీ ప్రజా ప్రతి నిధులున్నారు.