ముమ్మరంగా వాహన తనిఖీలు :  ఎస్సై తాజుద్దీన్

ముమ్మరంగా వాహన తనిఖీలు :  ఎస్సై తాజుద్దీన్

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం, ఏటూరునాగారం ఏ ఎస్పి సూచనలు మేరకు మావోయిస్టుల బందు పిలుపు నేపథ్యంలో ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో ముమ్మ రంగా వాహన తనిఖీలు చేపట్టారు. గత రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతా లలోని గుండాల మండలం దామరతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు దళ సభ్యుడు మృతి చెందిన విషయం తెలిసిందే... సోమవారం దామరతోగు ఎన్కౌంటర్ ను ఖండిస్తూ ములుగు. భూపాల పల్లి జిల్లాల బందుకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం, ఎప్పటికప్పుడు పోలీస్ బలగాలు మోహరించి విస్తృతంగా తనిఖీలు నిర్వహి స్తున్నారు. దామర తోగు ఎన్కౌంటర్ ఖండిస్తూ ములుగు. భూపాలపల్లి జిల్లాల బందుకు పిలుపునివ్వడంతొ మావోయి స్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉండడంతో పోలీసు బలగాలు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతు న్నారు. ఈ కార్యక్ర మంలో ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్, సివిల్, సిఆర్పి ఏఫ్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.