పేరూరు పోలీసుల ఆధ్వర్యంలో ఎన్ హెచ్ పై వాహన తనిఖీలు.
పేరూరు పోలీసుల ఆధ్వర్యంలో ఎన్ హెచ్ పై వాహన తనిఖీలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి. ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరి ధిలోని వాజేడు మండలం పేరూరు పోలీసులు గురువారం సాయంత్రం పొద్దుపోయే సమయానికి పేరూరు గ్రామ పరి సరాల ప్రాంతంలో, జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి .రమేష్ ఆధ్వర్యంలో వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగ తనిఖీలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని ఈ సందర్భంగా రాబట్టారు. అలాగే ప్రతి ఒక్క వాహనదారుడు పత్రాలు కలిగి ఉం డాలని, రోడ్డు ప్రయాణ భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పేరూరు సివిల్ పోలీసులతో పాటు, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు వాహనాల తనిఖీల కార్యక్రమంలో పాల్గొన్నారు.