ఈనెల 7న ఎటూరునాగారంలో వాడబలిజ సేవా సంఘం సమావేశం.  

Written by telangana jyothi

Published on:

ఈనెల 7న ఎటూరునాగారంలో వాడబలిజ సేవా సంఘం సమావేశం.  

– సంఘం రాష్ట్ర కమిటి అధ్యక్షుడు డర్రా దామోదర్. 

 వెంకటాపురం నూగూరు,   తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా ఎటూరునాగారం లో ఈనెల 7వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు వాడ బలిజ సేవా సంఘం నూతన కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షులు డర్రా దామోధర్ వెంకటా పురంలో శుక్రవారం సాయంత్రం మీడియా కు ప్రకటనను విడుదల చేశారు.  7న ఏటూరు నాగారం మండల కేంద్రం లోని బి.ఆర్ .ఫంక్షన్ హాల్ నందు తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం నూతన కమిటీ పిలుపు మేరకు వాడ బలిజ సేవా సంఘం ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీలు, మండల కమిటీల ఎన్నిక లు నిర్వహించ నున్నట్లు తెలిపారు. రెండు జిల్లాల వాడ బలిజ కుల సంఘం పెద్దలు, యువకులు, విద్యావంతులు, మేధా వులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ములుగు మరియు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీలు మండల కమిటీల ఎన్నిక కు పూర్తిస్థాయిలో సహకరించాలని రాష్ట్ర నూతన కమిటీ పిలుపునిచ్చారు. మన సంఘ మంతా సంఘ టితంగా ఉండి హక్కుల సాధన కోసం ఒక్క తాటిపై నిలిచి ప్రభుత్వం నుండి బి.సి. సంక్షేమ పథకాలు మంజూరు చేయించు కుందామని వాడ బలిజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు, కమిటీలు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. సమస్యపై వెంటనే స్పందించే చురుకైన కార్యకర్తలను సంఘం సభ్యులను, మనమంతా సమిష్టిగా ఎన్నుకొని మన సమస్యలు మన కమిటీలు, అనే భావనతో కలిసికట్టుగా ఉండి, ప్రభుత్వం నుండి హక్కులు సాధించుకోవాలని, ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీ పిలుపునిచ్చింది.

Leave a comment