పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

Written by telangana jyothi

Published on:

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

– యజమానులు తమ పశుసంపదకు విధిగా టీకాలు వేయించాలి

– పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వేణు

వెంకటాపురం నూగురు తెలంగాణ జ్యోతి :ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ప్రతి ఏడాది సీజనల్ గా పశువు లకు వచ్చే వ్యాధుల నివారణకు ముందస్తుగానే ప్రభుత్వ పరంగా పశుసంవర్ధక శాఖ సిబ్బంది వేసే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. రైతులు,పెంపకం దారులు తమ పశువులకు విధిగా టీకాలు వేయించుకొని, వ్యాధి నిరోదక చర్యలు, జాగ్రత్తలు వహించా లని వెంకటాపురం పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వేణు కోరారు. మండలంలోని 18 పంచాయతీలలో నెల రోజులు పాటు జరిగే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం వెటర్నరీ,అసిస్టెంట్ లు , సిబ్బంది ముమ్మరంగా చేపట్టారు. ఉదయాన్నే వెటర్నరీ సిబ్బంది రైతుల ఇళ్లకు వెళ్ళి వారి పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. ఈ మేరకు మండలంలోని ఆలుబాక, నూగూరు, వెంకటాపురం తదితర మూడు గ్రామీణ పశు వైద్యశాలల పరిధిలోని గ్రామాలలో ఉదయం, సాయంత్రం వేళలలో పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేప ట్టారు. ఆయా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్ర మాన్ని ఇన్చార్జి వెటర్నరీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పవన్ కుమార్ పర్యవేక్షణలో సిబ్బంది టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. మండలంలో సుమారు 15 వేలకు పైగా తెల్ల,నల్ల పశువులు ఉన్నట్లు గుర్తించారు. వెటర్నరీ అసి స్టెంట్లు ఎం. రామారావు, గొంది అరుణ, సునీల్ మరియు సిబ్బంది తో వారి పరిధిలోని గ్రామాల్లో టీకాల కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. అలాగే గొర్రెలు, మేకలు, కు నట్టల మందు, జీవాలకు సీజనల్ వ్యాధులు,నీలి నాలుక వ్యాది నివారణకు టీకాలు తదితరాలకు ప్రభుత్వ పరంగా పశు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు,పెంపకం దారులు ఇళ్లకే నేరుగా వెళ్లి వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసారు. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యాన్ని పశువుల యజమానులు, జీవాల యజమానులు సద్వినియోగం చేసుకొని, విలువైన పశు సంపదను, సీజనల్ వ్యాధుల నుండి కాపాడుకొని లబ్ధి పొందాలని పశు సంవర్దక శాఖ విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now