ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి
– ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి.
– భూ తాపాన్ని తగ్గించేందుకు అందరు కృషి చేయాలి
– న్యాయవాది వాసం నాగరాజు
వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి: పచ్చదనం పరిశుభ్రతను విద్యార్థులు విధిగా పాటించాలని మాజీ సర్పంచి కొర్స నర్సింహా మూర్తి పిలుపునిచ్చారు. స్వచ్ఛ త హీ సేవలో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్ల గూడెం పంచాయతీ కార్యదర్శి తాటి మౌనిక జి.పి. పరిధిలోని చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో శనివారం సంస్కృతిక కార్యక్రమాలు, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. కబడ్డీ, కోకో వంటి క్రీడలు నిర్వహించారు. పోటీలో గెలుపొందిన వారికి ప్రధాన ఉపాధ్యాయులు సపక నాగరాజు, మాజీ సర్పంచి కొర్స నర్సింహా మూర్తి, న్యాయవాది వాసం నాగరాజు బహుమ తులను ప్రధానం చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని క్రమంగా తగ్గించాలని అన్నారు.ప్లాస్టిక్ కారణంగా భూతాపం పెరు గుతోందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. పకృతి విపత్తులు ఏర్పడి మానవాళికి ముప్పు సంభవించే ప్రమా దం ఉందని, విద్యార్థులకు తెలిపారు. ఇంత చక్కటి కార్య క్రమం నిర్వహించినందుకు పంచాయతీ కార్యదర్శి మౌని కను ప్రధాన ఉపాధ్యాయులు సబకా నాగరాజు ఉపాధ్యా యులను, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు ప్రశం సించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయు లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.