అన్నదాతను నిండా ముంచిన అకాల వర్షం

అన్నదాతను నిండా ముంచిన అకాల వర్షం

అన్నదాతను నిండా ముంచిన అకాల వర్షం

– ప్రభుత్వ వైఫల్యమేనని రైతుల ఆవేధన

ఏటూరునాగారం,తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా  ఏటూరు నాగారం ఏజెన్సీలో బుదవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి మండలంలోని గోగుబెల్లి గ్రామ శివార్లో రైతులు ఏర్పాటు చేసుకున్న దాన్యం కొనుగోలు కేంద్రంలోకి ఊర వాగు ఉప్పొంగి ముంచేసింది. దీంతో 45 మంది రైతులు ఆర బోసుకున్న 4వందల ఎకరాల దాన్యం రాశులు వరదలో కొట్టుకు పోయి తీవ్రంగా నష్టపోయారు. అంతే కాకుండా లోడింగ్ కు సిద్దంగా ఉన్న దాన్యం బస్తాలను మిల్లర్లు క్వింటాకు 10 కిలోలు తరుగు తీయాలనడంతో కేంద్రంలోనే ఉంచామని రైతులు చెబుతున్నారు. వరద తాకిడికి బస్తాలు సైతం తడిసి ముద్దయి నాయని రైతులు ఆవేధన చెందుతున్నారు.జరిగిన నష్టం పై వెంటనే సర్వేలు చేపట్టి రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క వర్షంతో తడిసిన కళ్ళాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వేలు నిర్వహించి నష్ట పోయిన రైతుల వివరాల నివేధికలు పంపాలని అధికారులను ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment