పత్తి రైతులపై పట్టింపులేని పాలకులు
– 70శాతం దిగుబడి తగ్గినా ఆదుకోని ప్రభుత్వం
– గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుకు భరోసా
– సీసీఐ కేంద్రాలు ఏర్పాటుచేసి మద్ధతు ధర పెంచి కొనుగోళ్లు చేపట్టాలి
– పంటనష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
– ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్
ములుగు ప్రతినిధి : అకాల వర్షాలు, వాతావరణ మార్పుల తో పత్తిరైతులకు కన్నీరే మిగులుతోంది.. భూసారం తగ్గిపోయి గతంలోకంటే 70శాతం తక్కువ దిగుబడి వచ్చినా పాలకులు పత్తిరైతును పట్టించుకున్న పాపాన పోలేదు. పేరుకే బోనస్ అంటూ ప్రకటనలు చేస్తున్నారే తప్ప అమలుకు నోచుకోవడం లేదు. గత బీఆర్ఎస్ పాలనలోనే రైతులకు భరోసా కల్పించా రని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంతో పాటు బోనస్ అందించాలని, లేదంటే మద్ధతు ధర పెంచి పత్తి రైతులను ఆదుకోవాలని ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని, పత్తి పంటపై సమీక్ష జరుపకుండా కాలం వెల్లదీస్తూ రైతులను దివాలా తీస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ములుగు మండలం అన్నంపల్లి సమీపంలో పత్తి పంటను పరిశీలించి పలువురు రైతులతో మాట్లాడారు. పెట్టుబడి, దిగుబడులకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోవింద్ నాయక్ మాట్లాడుతూ.. పత్తి సాగు చేసిన రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నా యని, రైతులంటే అంత అలుసా అని ప్రశ్నించారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో పత్తిరైతులు తీవ్రంగా నష్టపోయారని, 70శాతం దిగుబడి తగ్గిందని, కేవలం 30శాతం మేర మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉండటం తో పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. పెట్టిన పెట్టుబడిలో 50శాతం పెట్టు బడి చేతికి వచ్చే పరిస్థితి లేదని, నిబంధనల మేరకు పకృతి వైఫరిత్యాల వల్ల 33శాతం మించి పంట నష్టం జరిగితే రైతులకు నష్టపరిహారం పొందడానికి అర్హులని జీవోలు చెబుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రేస్ ప్రభుత్వం పత్తి రైతుల గోసపై ఎందుకు స్పందించడం లేదని గోవింద్‌నాయక్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 43,76,043 ఎకరాల విస్థీర్ణంలో పత్తి పంట సాగు అయినట్టు క్రాప్ బుకింగ్ పోర్టల్ లో వ్యవసాయ శాఖ పొందుపరిచిందని తెలిపారు.గత ఎన్నికల సందర్బంగా కాంగ్రేస్ ధాన్యంతోపాటు పత్తికి కూడా క్వింటాల్ కు రూ.475ల బోనస్ ఇస్తామని మ్యానిఫేస్టోలో చెప్పిందన్నారు. వచ్చిన తక్కువ పంటను కూడా ప్రైవేటు దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తు న్నారని ఆరోపించారు.
– సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
పత్తి కొనుగోలు ధరలు నిర్ణయించడం కేంద్రప్రభుత్వ పరిధి లోని సీసీఐ పరిధిలో ఉంటుందని, రాష్ర్టంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ సీసీఐ (కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండి యా) ఇప్పటికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవటం వారి పనితనానికి నిదర్శనమని గోవింద్‌నాయక్ అన్నారు. రాష్ట్రంలోని విస్తీర్ణంలో 1/3 వంతు పత్తి పంట సాగైందని, రైతుల పరిస్థితిపై శాస్థ్రీయ కోణంలో రిపోర్టులు తెప్పించుకు ని ఇప్పటికే సమీక్ష నిర్వహించాల్సి ఉందని, కానీ, అధికారు లు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదన్నారు. ములుగు నియోజకవర్గంలో సుమారు 56వేల ఎకరాల్లో పత్తిపంట సాగైనట్టు వ్యవసాయ శాఖ రిపోర్ట్ చేసిందని, వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 5లక్షల 34 వేల క్వింటాళ్ళ పైచిలుకు దిగుబడి వస్తుందని అంచనా వేసిందన్నారు. సీసీఐ కొనుగో లు కేంద్రాల ద్వారా పత్తి అమ్ముకుంటే రైతులకు రూ.7500ల మద్దతు దర పొందే అవకాశం ఉందన్నారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, రైతుల పక్షాన సంబంధిత అదికా రులకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులను ఆదుకోవాలని కోరారు.