పాఠశాలలు పున ప్రారంభం నాటికి విద్యార్థులకు ఏక రూప దుస్తులు పంపిణీ జరగాలి
– జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: పాఠశాలలు పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు ఏక రూప దుస్తులు పంపిణీ జరగాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కాటారం మండల కేంద్రంలోని మహిళ సమాఖ్య భవనంలో జీవన జ్యోతి మండల సమాఖ్య మహిళ సంఘ సభ్యులు కుడుతున్న విద్యార్థుల ఏక రూప దుస్తుల కుట్టు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులకు యూనిఫామ్ లు అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. మండలంలోని మొత్తం 49 మండల పాఠశాలలకు గాను901 మంది బాలురు,988మంది బాలికలతో కలిపి మొత్తం 1889 విద్యార్థులకు 3,878యూని ఫామ్ లు తయారీకి జీవన జ్యోతి మండల సమాఖ్య సభ్యు లకు భాధ్యత అప్పగించడం జరిగిందని తెలిపారు.ఈ యూని ఫాంల తయారీ జూన్ 10 వ తేదీలోగా అందించాలని, జూన్ 12 నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో జూన్10 వ తేదీ లోపు బాల, బాలికలకు యూనిఫామ్ లను అందించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. శిక్షణ పొందిన సమాఖ్య మహిళ సభ్యులు విద్యార్థుల కొలతల ఆధారంగా యూనిఫాంలను కుట్టాలని అన్నారు. యునిఫామ్ తయా రీలో నాణ్యమైన మెటీరియల్ వినియోగించాలని సూచిం చారు. యూనిఫామ్ ధరించిన పిల్లలు నూతన ఉత్సాహంతో, తేజరిల్లేలా అంత ఖచ్చితంగా విద్యార్థులకు అద్దినట్లు తయా రు చేయాలని కలెక్టర్ అన్నారు.పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొలతలు 5 గురు చొప్పున భిన్నమైన సైజ్ కొలత లు బేరుజు చేసుకొని మరి బిగుతుగా కాకుండా వదులుగా ఉండే విధంగా యూనిఫామ్ లను కుట్టాలని సమాఖ్య సభ్యు లకు కలెక్టర్ సూచించారు. ఈ సీజన్ పూర్తి కాగానే మహిళ గ్రూప్ సబ్యులకు చేయూత కలిపించడానికి ప్రభుత్వ పరమై న యూనిఫామ్ ల తయారీని ప్రభుత్వం మహిళ సంఘాలకు అప్పగించే ఆలోచనలో ఉందని ఆయన తెలిపారు.ఈ సంద ర్భంగా యూనిఫామ్ ల తయారీ విధానాన్ని, బట్ట నాణ్యతను పరిశీలించి మహిళా సమాఖ్య సబ్యులకు శుభాకాంక్షలు తెలి పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ నరేష్, తహసిల్దార్ నాగరా జు, ఎంపిడిఓ బాబు, ఎంపిఓ ఉపేంద్రయ్య, యూనిఫామ్ కుట్టు శిక్షకురాలు వనిత, జీవన జ్యోతి మండల సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కాటారం మండలంలోని పోతులవాయి, బయ్యారం గ్రామాల్లో ఎంపిపియస్ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీ లించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 12 వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నందున పాఠశా లల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, పనుల్లో పెండింగ్ ఉన్నట్ల యితే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. పనులు నిరం తరాయంగా జరిగేందుకు ఇప్పటికే 20 శాతం నిధులు విఓ, విఏఓ జాయింట్ అకౌంట్లో జమ చేశామని అన్నారు. నిధుల కొరత లేనందున చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయా లన్నారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి అంచనా వ్యయాన్ని సంబంధిత ఎంపిడిఓలకు అందచే యాలని, త ద్వారా మిగిలిన మొత్తాన్ని మీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయ డం జరుగుతుందని సంబంధిత విఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ బాబు, పంచాయతీ రాజ్ డిఈ సాయిలు, రెండు గ్రామాల విఓ లు తదితరులు పాల్గొన్నారు.