ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల ఫారం19 పై అవగాహన
ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల ఫారం19 పై అవగాహన
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల ఎన్నికలపై సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలలో వేర్వేరుగా మండల అధికారులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు బూత్ ఆఫీసర్లతో ఫారం. 19 స్వీకరణ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఫారం. 19 స్వీకరణ అంశంపై అన్ని వివరాలు బూత్ ఆఫీసర్ల వద్ద తీసుకొని, ఫారం 19 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తమ తోటి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించి ఎమ్మెల్సీ టీచర్ ఎన్నికలు 2024 నిర్వహణలో పాల్గొనాలని అదికారులు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ టీచర్ ఎన్నికలపై అనేక అంశాలపై సుదీర్ఘంగా ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఎన్నికల నియమ నిబంధనలు తదితర అంశాలపై ఉపాధ్యాయుల సమావేశంలో సుధీర్ఘంగా అవగాహన కల్పించారు. నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో, మండల తాసిల్దార్ లక్ష్మీరాజయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ టీచర్ ఎన్నికల అవగాహన సమావేశం నిర్వహించారు. అలాగే వాజేడు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల తహసిల్దార్ డీ.వీ.బి. ప్రసాద్, ఎంపీ డీవో విజయ, ఎంఈఓ ఇతర శాఖల అధికారులు, ఉపాధ్యా యులు ఉపాధ్యాయ సంఘాలు, ప్రధానోపాధ్యాయులతో ఎమ్మెల్సీ టీచర్ ఎన్నికలపై అవగాహన కల్పించారు.