నిండు జీవితానికి రెండు చుక్కలు.
ములుగు, తెలంగాణ జ్యోతి : జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవంలో భాగంగా తాడ్వాయి మండలం కాటాపూర్ బస్ పాయింట్ వద్ద ట్రాన్సిట్ టీమ్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రంజిత్, ఎమ్మెల్ హెచ్ పి ఆస్పియా, సాయి చందులు మాట్లాడుతూ రెండు చుక్కలు నిండు జీవితాన్ని ఇస్తాయని గ్రామ ప్రజలంతా ఐదు సంవత్సరాలలో పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పకుండా వేయించి, పోలియో రైతు సమాజానికి తోడ్పడాలని సూచించారు. పల్స్ పోలియో టీకా గురించి ఆరోగ్య అవగాహన అందించారు. ఈ కార్యక్రమంలో ఆశ కవిత, ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు.