భారీ వర్షంతో అతలాకుతలం…

Written by telangana jyothi

Published on:

భారీ వర్షంతో అతలాకుతలం…

– స్తంభించిన జనజీవనం

– ప్రధాన రహదారిపై విరిగిపడ్డ చెట్లు.

– కూలిన పూరి గుడిసెలు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలలో మంగళవారం నుండి భారీ నుండి అతి భారి వర్షం కురుస్తుండడంతో అనేక పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ నుండి అతి భారీ వర్షం కురుస్తుండడంతో వెంకటాపురం టు చర్ల రహదా రిలోని ఎదిర ప్రాంతంలో చెట్లు కూలి రోడ్డుకు అడ్డుగా పడి పోయాయి. దీంతో వెంకటాపురం – చర్ల రాకపోకలు స్తంభిం చాయి. సమాచారం తెలియడంతో, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జెసిబి ల ద్వారా చెట్లను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. వెంకటాపురం మండలంలోని వీరభద్రారం గ్రామంలో భారీ వర్షాలకు సోమవారం అర్ధరాత్రి పూనేం రాజేష్ అనే గిరిజ నుడి ఇల్లు కుప్పకూలిపోయింది. అర్ధరాత్రి నిద్రలో ఉండగా ఇల్లు కూలిపోయే సమయంలో బయటకు పరుగులు తీసి ప్రమాదం నుండి కుటుంబం తప్పించుకున్నారు. కుప్పకూలి పోయిన ఇంటిలో సామాగ్రి తడిసి ముద్దయింది. మంచాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ధ్యంసం అయ్యాయి. నిలవనీడ లేని ఆ పేద ఆదివాసి కుటుంబానికి గ్రామస్తులంతా అండగా నిల బడి ప్లాస్టిక్ టార్బలిన్ తో తాత్కాలికంగా నీడ కల్పించారు. అలాగే నిలువ నీడ లేకుండా ఇల్లు కూలిపోయిన రాజేష్ ఆదివాసి కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం మంజూరు చేసి, పక్కా ఇల్లు మంజూరు చేయాలని ఆ పేద కుటుంబం విజ్ఞప్తి చేస్తున్నది. భారీ వర్షాలు కారణంగా మంగళవారం వ్యవసాయ పనులు స్తంభించిపోయాయి. వెంకటాపురం మండల కేంద్రంలో మంగళవారం వారాంతపు సంత వెలవెల పోయింది. దూర ప్రాంతాల నుండి సంతకు సరుకులు తీసుకొని వచ్చి న చిరు వ్యాపారులు సైతం, తమ సరుకులు, వస్తువులు, తడవకుండా టార్పల్ను కప్పుకొని, అర కొరగా బేరాలు కొనసాగిస్తున్నారు. మంగళవారం వెంకటా పురం వారాంతపు సంత భారీ వర్షం కారణంగా బేరాలు గణనియంగా పడి పోయాయి. ప్రభుత్వ పాఠశాలలకు సైతం విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గిపోయింది. భారీ వర్షం కారణంగా అనేక వాగులు పొంగి ప్రవహిస్తూ ఉండ డంతో పాటు పళ్ళపు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.

Leave a comment