రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళి
కాటారం, తెలంగాణ జ్యోతి : భారతరత్న రాజ్యాంగ రూపకర్త భారత దేశ తొలి నాయి శాఖ మంత్రి తత్వ శాస్త్రవేత్త చరిత్ర కారుడు బడుగుల వర్గాల్లో వెలుగు నింపిన అన్ని వర్గాల కోసం అనునిత్యం పోరాటం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దళిత రత్న అవార్డు గ్రహీత స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గజ్జె రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పూలమాల వేసి అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నేతకాని సంఘం సీనియర్ నాయకులు చల్లూరి సమ్మయ్య , సంఘం జిల్లా కార్యదర్శి జాడి అశోక్, భౌతు రాజేష్, చల్లూరి కమలాకర్,జిల్లా యూత్ అధ్యక్షులు రమేష్, దుర్గం బిక్షపతి, రఘు ,జిల్లా యూత్ సెక్రెటరీ విజయ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ దుర్గం అనిల్, ఆకుదారి జాడి, సర్వీస్, మనోహర్, భౌతి కుమార్, దుర్గం రాజు, దుర్గం రాకేష్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.