మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల ధర్నా
– తరలివచ్చిన ఆదివాసి సంఘాలు ప్రజలు
ఏటూరునాగారం/ వెంకటాపురం నూగూరు : మావోయిస్టు ల దుశ్చర్య ను నిరసిస్తూ శనివారం ఉదయం ఆదివాసీలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఇన్ ఫార్మర్ల నెపంతో గురువారం రాత్రి ఇద్దరిని మావోయిస్టులు దారుణం గా నరికి చంపిన విషయం పాఠకులకు తెలిసిందే… ఈ దుశ్చర్యను నిరసిస్తూ శనివారం ఉదయం ఆదివాసీలు, ఆదివాసీ సంఘా ల నాయకులు ఏటూరునాగారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీలు ఉయిక రమేష్, ఉయిక అర్జున్‌ను మావోయి స్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో హతమార్చిన ఈ దుశ్చర్యను వ్యతిరేకిస్తూ ఏటూరునాగారం వై జంక్షన్ నుంచి బస్టాండ్ వరకు మావోయిస్టులు డౌన్ డౌన్ అంటూ నినదించారు. మావోయిస్టుల పోరాటం అంటే అమాయక ఆదివాసులను చంపటమేనా అంటూ బ్యానర్లతో, ప్లకార్డులతో పెద్ద ఎత్తున ఆదివాసీలు, సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. అమా యక ఆదివాసులను, పోలీస్ ఇన్ ఫార్మర్ ల నెపంతో చంప టం మావోయిజమా అంటూ నినాదాలు చేశారు. మావోయి స్టుల హత్యల ధమనకాండల పై ప్రజా సంఘాలు స్పందించా లని ర్యాలీలో నినాదాలు చేశారు. భారీ నిరసన ర్యాలీకి అనేక ప్రాంతాల నుండి తరలిరావడంతో ఏటూరునాగారం నిరసన కారులతో కిక్కిరిసి పోయింది. నిరసన ర్యాలీ సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు.