ముగ్గుల పోటీలు మహిళలలో పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది

ముగ్గుల పోటీలు మహిళలలో పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది

– యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య

– ములుగు హైటెక్ సిటీలో ముగ్గుల పోటీలు 

– గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం

ములుగు, తెలంగాణ జ్యోతి : ముగ్గుల పోటీలు మహిళ లలో పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి సీతక్క తనయుడు సూర్య పేర్కొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ములుగు హైటెక్ సిటీ వెంచర్లలో మహిళలకు ముగ్గులు పోటీలు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించారు. ములుగు హైటెక్ సిటీ వెంచర్ యజమానులు శ్రీనివాస్ రెడ్డి. వెంక రెడ్డి ల ఆధ్వర్యం లో ముగ్గుల పోటీ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క తనయుడు సూర్య హాజర య్యారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో హాజరై తమ యొక్క ప్రతిభను ముగ్గులతో కనబరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవం కార్యక్ర మాన్ని ఉద్దేశించి మంత్రి తనయుడు సూర్య మాట్లాడారు. వెంచర్ యజమానులు నమ్మకాన్ని పెంపొందిం చుకోవాలని, అప్పుడే వెంచర్లు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహిళలకు, ప్రజలకు, వెంచర్ యజమాన్య కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మొదటి బహుమతి మధురిమ కు ఎల్ఈడి టీవీ, ద్వితీయ బహుమతి మౌనికకు ట్యాబు, తృతీయ బహుమతి రాధికకు ఎలక్ట్రిక్ కుక్కర్, కన్సలేషన్ బహుమతి నిఖితకు, ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మహిళల పేరు మీద ప్లాట్ బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక రాయితీ ఇచ్చారు.ఈ కార్యక్ర మంలో విద్యావేత్త డాక్టర్ పరంజ్యోతి, జిల్లా కిసాన్ సెల్ అద్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్ , సర్పంచ్ నూనెటి సువర్ణ సాంబయ్య, సర్పంచ్ అహ్మద్ పాష, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్ జిల్లా నాయకులు మేకల ప్రశాంత్, వెంచర్ యజమానులు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, నాగార్జున రెడ్డి, సమ్మయ్య, అర్జున్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment