గాలి దుమారాలు భారీ వర్షాలకు విరిగిపడిన చెట్లు

గాలి దుమారాలు భారీ వర్షాలకు విరిగిపడిన చెట్లు

గాలి దుమారాలు భారీ వర్షాలకు విరిగిపడిన చెట్లు

– నేల కు ఒరిగిన విద్యుత్ స్తంభాలు

– అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

– రాజ్యమేలుతున్న అంధకారం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో మంగళ వారం సాయంత్రం నుండి భారీ వర్షాలు, మరియు ప్రచండ వేగంతో వీస్తున్న పెనుగాలులతో అనేక చెట్లు విద్యుత్తు లైన్లో పై విరిగిపడటంతో గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రచండ వేగంతో ఈదురు గాలులు, భారీ వర్షంతో పాటు దిక్కులు పీక్కు టిల్లే విధంగా పకృతి విలయతాండవం చేసింది. మండల పరిధిలోని ఆలు బాక తో పాటు ఇంకా అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు గాలి దుమారాలకు నేలకొరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ఆ శాఖ అధికారులు నిలిపివేశారు. మిర్చితో పాటు, యాసంగి వరి పంట సైతం వడ గళ్ల వాన, ఈదురు గాలులు, భారీ వర్షాలతో దెబ్బతింది. పకృతి విలయతాండంతో మిర్చి, వరి,మామిడి రైతులు తీవ్రంగా నష్టపో యారు. మరో 24 గంటలు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో, రైతుల గుండెల్లో రైళ్లు పరిగె డుతున్నాయి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment