భారీ వర్షాలతో విద్యుత్ లైన్ లపై విరిగిపడిన చెట్లు

భారీ వర్షాలతో విద్యుత్ లైన్ లపై విరిగిపడిన చెట్లు

– రిపేర్లు నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలంలో శనివారం సాయం త్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా విద్యుత్తు లైనులపై అనేక చెట్లు విరిగి విద్యుత్తు తీగలపై పడ్డాయి. దీంతో వెంటనే సమాచారం అందుకున్న వెంకటాపురం ఏ డి ఈ ఆకిటీ స్వామి రెడ్డి ఆదేశంపై వెంకటా పురం సబ్ స్టేషన్ పరిధి  గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అలాగే వాజేడు మండలం గుమ్మడీ దొడ్డి వద్ధ తీగెలపై చెట్లు పడటంతో మండలంలోని ధర్మారం, వాజేడు సబ్ స్టేషన్ లో సరఫరా నిలిపి వేశారు. మండలంలో సుమా రు 15 మందికి పైగా రెగ్యులర్ సిబ్బందితో పాటు, ప్రైవేటు సిబ్బందిని ఏర్పాటు చేసి శనివారం మధ్యాహ్నం నుండి విరిగి కిందపడిన విద్యుత్ వైర్లను తొలగించి వాటి స్థానంలో కొత్త తీగలను అమర్చే పనులను విద్యుత్ శాఖ చేపట్టింది. వెంక టాపురం శివారు బీసీ మరిగూడెం, సుడిబాక, చిరుత పల్లి, వాజేడు మండలం గుమ్మడి దొడ్డి వద్ద చెట్లు తీగలపై పడడం తో విద్యుత్ సరఫరా లేక అంధకారంలో మగ్గుతున్నాయి. శనివారం సాయంత్రం భారీ వర్షంతో అనేక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరి కొద్ది గంటల్లోనే ఆయా గ్రామా లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి కృషి చేస్తు న్నట్లు వెంకటాపురం ఏడిఇ ఆకిటి స్వామి రెడ్డి శనివారం రాత్రి మీడియాకు తెలిపారు.

భారీ వర్షాలతో విద్యుత్ లైన్ లపై విరిగిపడిన చెట్లు