దాతల సహకారంతో బాలుడి చికిత్స
– చేయూత ఫౌండేషన్ ప్రతినిధి చిడెం సాయి ప్రకాష్
వెంకటాపురం (నూగూరు), తెలంగాణాజ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామానికి చెందిన ఇండ్ల సుశాంత్ అదే గ్రామంలో 3తరగతి చదువుతున్నాడు. గత పది రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా, పరిస్థితి విష మించడంతో భద్రాచలంలోని మోహన్ రావు హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. మెరుగైన వైద్యం కోసం, హైదరాబాద్ వెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే అందుకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా మారడంతో చేయూత ఫౌండేషన్ ప్రతినిధి చిడెం సాయి ప్రకాష్ చేయూతనందించారు. నూ గూరు స్కూల్ ఉపాధ్యాయురాలు ఇందిరా దేవి, కుర్సం విజయ్, తోటి ఉపాధ్యాయులు, దాతల సహకారంతో రూ. 30వేలు బాలుడి వైద్యం కోసం ఆర్థిక సాయం చేశారు. బాలుడు సుశాంత్ తల్లి దండ్రులైన ఇండ్ల సత్యవతి రాజ్ కుమార్ దంపతులు ఫౌండేషన్ సభ్యులకు కృతజ్క్షతలు తెలిపారు. అయితే హైదరాబాద్ లో తమ కుమారుడి వైద్యం కోసం అధికంగా ఖర్చులు అవుతున్నాయని, బాలుడి ప్రాణాలు కాపాడాలని ప్రాధేయపడుతున్నారు. తమది పేద కుటుంభం అని , చికిత్సకు తోచిన సహాయం అందించాలని వేడుకుంటున్నారు. తమకుమారుని చికిత్స కోసం దాతలు 8985607829 నెంబరుకు ఫోన్ పే చేసి ఆదుకోవాలని, వివరాలకు చేయూత ఫౌండేషన్ 8985394546 సంప్రదించ గలరని విజ్ఞప్తి చేశారు.