వాజేడులో బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ .
వాజేడులో బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు మండలంలో మంగళవారం ఎన్నికల విధు ల గురించి, కుటుంబ సభ్యులు అందరూ ఒకే పోలింగ్ కేంద్రములో ఓటు వేయుటకు వీలుగా ఫారం -8 ను ఉపయోగించి, సవరణ ఇతర అంశాలపై బూత్ లెవెల్ అది కారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. 1 తేది జనవరి, 2024 వరకు, 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటుహక్కు కల్పించుట, బిఎల్ఓ లు రిజిస్టర్ నిర్వ హణ, నమోదు గూర్చి, అలాగే ఫారం -6,7,8, ఆధారాలు జతపర చుట, డెత్, డబుల్ ఓటర్ తొలగింపు లు అంశాలపై వివరించారు. కొత్తగా ఓటు హక్కు నమోదు గురించి, త్వరితగతిన విచారణ పూర్తిచేయుట గురించి , బిఎల్ఒ , సూపర్ వైజర్ లకు తెలియజేశా రు .శిక్షణ కార్యక్రమంలోవాజేడు తహసీల్దార్ శ్రీనివాస్, నాయ బ్ తహసీల్దార్ రాహుల్ చంద్ర వర్మ, గిరిదావర్ రాజులు, సూపర్ వైజర్ లు, బిఎల్ఓ లు తదతరులు పాల్గొన్నారు.