సీఎం పర్యటనకు ముందు విషాదం
– కూంబింగ్ నిర్వహిస్తుండగా కరెంట్ షాక్
– స్పెషల్ పార్టీ పోలీస్ మృతి
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రి వర్గం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న నేపథ్యంలో కాటారం మండలంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా స్పెషల్ పార్టీ పోలీస్ కరెంట్ షాక్తో మృతి చెందారు. ఆదివారం రాత్రి కాటారం మండలం నస్తురుపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్ పార్టీలోని కానిస్టేబుల్ ప్రవీణ్ కు కరెంట్ షాక్ తగిలింది. అడవి జంతువుల కోసం ఏర్పాటుచేసిన విద్యుత్తు ఉచ్చులకు పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. విద్యుత్ షాక్ కు గురైన ప్రవీణ్ (32) అనే కానిస్టేబుల్ ను హుటాహుటిన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.