నేటి బాలలే రేపటి పౌరులు
– వివేకానంద ప్రిన్సిపల్ ప్రేమలత
ములుగు ప్రతినిధి : నేటి బాలలే రేపటి పౌరులని, వారి సమాజాన్ని తీర్చిదిద్దే మార్గదర్శలవుతారని శ్రీ వివేకానంద పాఠశాల ప్రిన్సిపల్ ప్రేమలత అన్నారు. ఈ మేరకు గురు వారం ములుగు మండలం మల్లంపల్లి లోని శ్రీ వివేకానంద పాఠశాలలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సంద ర్భంగా నవంబర్ 14న బాలల దినోత్సవంను ప్రిన్సిపల్ ప్రేమలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా పాటలు, నృత్యాలతో అందరినీ అలరించి ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతి భ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను ప్రధానం చేశారు. అనంతరం ప్రిన్సిపల్ ప్రేమలతో మాట్లాడు తూ “నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు అవుతారని” కాబట్టి విద్యార్థులంతా కష్టపడి చదివి తము లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.