మామిడి తోటకు నిప్పు పెట్టిన దుండగులు

మామిడి తోటకు నిప్పు పెట్టిన దుండగులు

మామిడి తోటకు నిప్పు పెట్టిన దుండగులు

– రామకృష్ణాపూర్ లో 2వేలకు పైగా చెట్లు దగ్ధం 

– సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం

– లబోదిబోమంటున్న బాధితులు

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : పంట చేతికి వచ్చే దశలో మామిడి తోట అగ్నికి ఆహుతయింది. గుర్తు తెలియని వ్యక్తులు తోటకు ఒక మూలన నిప్పంటించడంతో మంటలు చెలరేగి మామిడి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని బూరుగుపేట గ్రామపంచాయతీ రామకృష్ణాపూర్ శివారులో మామిడి తోటలో సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన మొకిరాల తిరుపతిరావు అనే రైతు మామిడి తోట నిర్వహిస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం 10గంటల సమయంలో మామిడి తోట సమీపంలోకి కొందరు వ్యక్తులు వచ్చి వెళ్లారని, అటువైపు నుంచి క్రమంగా మంటలు రావడం చూసి మంటలను ఆర్పేందుకు గ్రాస్థులను సహాయంగా తీసుకొని వచ్చేందుకు వెళ్లాడు. అంతలోనే గాలి తీవ్రతకు తోట అంతా మంటలు వ్యాపించి తీవ్రమయ్యాయి. ఈ సంఘటనలో తోట అంతా కాలిపోయిందని తిరుపతిరావు ఆవేదన వెలిబుచ్చారు. సుమారు 2వేలకు పైగా మామిడి చెట్టు దగ్ధమైనట్లు తెలిపారు. డ్రిప్ పైపులు కూడా కాలిపోయాయని, దీంతో సుమారు రూ.30లక్షల ఆస్తినష్టం జరిగిందన్నారు. కాగా, ఈ సంఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు రైతు వెల్లడించారు. చేతికచ్చిన పంట అగ్నికి ఆహుతి కావడంతో కుటుంబ సభ్యులు ఘొల్లుమన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment