ఫ్రీ అని చెప్పి డబ్బులు వసూలు చేశారు..!

ఫ్రీ అని చెప్పి డబ్బులు వసూలు చేశారు..!

ఫ్రీ అని చెప్పి డబ్బులు వసూలు చేశారు..!

– క్రీడా దుస్తులకు స్టూడెంట్ల నుంచి రూ.200ల వసూలు

   తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: ఫ్రీగా క్రీడా దుస్తులు అందిస్తున్నామని చెప్పి తీరా అడిగితే డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రెవుల పాఠశాలలో ఉపాధ్యా యుల ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా దుస్టులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చులతో క్రీడా దుస్తులు కొనుగోలు చేశామని, ఫ్రీగా పంపిణీ చేస్తున్నట్లు పత్రిక ప్రకటనలు, వాట్స్ గ్రూపులలో పెట్టిన పోస్టు లు వైరల్ అయ్యాయి. కానీ, క్రీడా దుస్తుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.200ల చొప్పున వసూలు చేశారని విద్యార్థులు ఆరోపించారు. ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చులతో క్రీడా దుస్తులు పంపిణీ చేశారని కొన్ని పత్రికలో ప్రచరితం కావడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా డబ్బు లు ఇస్తేనే దుస్తులు ఇచ్చారని మీడియాకు వెల్లడించడం గమనార్హం..