ఏటూరునాగారం అడవిలో పులి సంచారం లేదు
– రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం: ఏటూరునాగారం మం డల కేంద్రంలో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచరిస్తుందనే ప్రచారం అవాస్తవం అని ఫారెస్ట్ రేంజ్ అదికారి అబ్ధుల్ రెహెమాన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లా డుతూ రెండు రోజులక్రితం ఒక లారీ డ్రైవర్ పులి బొమ్మను చూసి పులి అనుకొని చెప్పిన వెంటనే మేము స్పందించి తనిఖీ చేయడం జరిగిందని, కానీ ఎటువంటి ఆనవాళ్లు కనిపించ లేదన్నారు. గురువారం కడా రాంనగర్ గ్రామానికి చెందిన ఒక రైతు తనకు చెందిన పంట పొలానికి మందు వేయడానికి వెళ్లగా పులిని చూశానని చెప్పిన వెంటనే మా ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది తనిఖీ చేయడం జరిగిందని, ఎలాంటి పులి ఆనవాళ్లు కనబడలేదని, అక్కడ ఒక కుక్కను గుర్తించడం జరిగిందన్నారు. ప్రజలు ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దని, ఎలాంటి పులి సంచరించడం లేదని, ప్రజల కోసం ప్రతి క్షణం సేవ చేయటం కోసం మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. ఏలాంటి పరిస్థితి ఉన్న మా అధికారులకు సమాచారం అందించాలని ఎఫ్ఆర్వో అబ్దుల్ రెహమాన్ కోరారు.