కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు సమన్యాయం.

కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు సమన్యాయం.

కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు సమన్యాయం.

– ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు.

   వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని, గత ప్రభుత్వ హయాల్లో అన్ని రంగాల్లో వెనుకబడి పోయిన తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే, అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపరిచి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో ముందుకు సాగుతున్నా రని, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, సీని యర్ నాయకులు అన్నారు.శనివారం సాయంత్రం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా స్థానిక ప్రభు త్వ అతిధి గృహం ఆవరణలో, కాంగ్రెస్ నాయకులు కార్యక ర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ,కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపు కున్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేసుకొని ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల ముంగిల్లో ప్రజా ప్రభుత్వం, ప్రజా విజయోత్సవాలు అనే నినాదంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు గ్రామ, గ్రామాన అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అం ధే విధంగా కృషి చేయాలని, భవిష్యత్తులో జరగబోయే స్దానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్త లందరూ సమన్వయంతో, పార్టీ పరంగా సైనికులుగా పనిచేసీ, గ్రామ, గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా రెప రెపలాడే విధంగా నడుం బిగించి ముందుకు సాగాలని పిలుపు నిచ్చా రు. ఈ సందర్భంగా జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినా దాలు చేసి బాలసంచా పేల్చేరు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్య క్షుడు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడెం సాంబశివరావు, మన్యం సునీల్, రమేష్, థనపనేని నాగరాజు, కాల్వ సుందర్రావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టెం సాయి స్వామి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుందర్ రావు, మద్దుకూరి ప్రసాద్ లతోపాటు కార్యకర్తలు  పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment