ఎంపీడీఓ ఆఫీస్ లో మంచి నీళ్లు కరువు..!
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయి గూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పలు పనుల నిమిత్తం ఆఫీస్ వచ్చిన ప్రజలకు మంచి నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 రోజుల నుండి ఇదే పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముందే ఎండాకాలం అత్యవసర పనుల నిమిత్తం కొరకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు పడుతున్నామని, ఇటు ఎంపీడీఓ కార్యాలయంలో, అటు ఈజిస్ లో కూడా మంచి నీళ్లు లేకపోవడంతో మండల ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే ఎంపీడీవో అధికారులు స్పందించి వచ్చి పోయి రైతులకు మంచి నీళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.