పథకం ప్రకారం అన్నని హత్య చేసిన తమ్ముడు
ములుగు, ఫిబ్రవరి2, తెలంగాణ జ్యోతి: మండలంలోని మల్లంపల్లి శివారులో తమ్ముడిని విద్యుత్ షాక్ తో అన్న హత్య చేసిన మిస్టరీని పోలీసులు చేదించారు. రాజుపల్లి గ్రామానికి చెందిన అన్న కావటి బిక్షపతి, తమ్ముడు కావటి సుధాకర్ మధ్య గత కొన్నేళ్లుగా భూ వివాదం కొనసాగు తుంది. ఈ నేపథ్యంలో జనవరి 31న బిక్షపతి పొలం వద్ద నీళ్లు పెట్టడానికి వెళ్లగా అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు సుధాకర్, అతని భార్య రాధిక పథకం ప్రకారం విద్యుత్ కనెక్షన్ ఇచ్చి హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ పంపినట్లు సిఐ రంజిత్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.