అనారోగ్యంతో గ్రామీణ వైద్యుని సతీమణి మృతి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం పట్టణంలో గ్రామీణ వైద్యులుగా దశాబ్దాల కాలంగా సేవలందిస్తున్న నంచర్ల నరస య్య సతీమణి శ్రీదేవి గురువారం హైదరాబాదులో చికిత్స పొందుతూ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల వెంకటాపురం, వాజేడు మండలాల గ్రామీణ వైద్యుల సంఘం, మెడికల్ షాప్ యూనియన్ లు , బంధువులు, మిత్రులు పుర ప్రముఖులు పలువురు ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు.