ఈనెల ఐదు లోపు దృవీకరణ పత్రాలు సమర్పించాలి
– డీఎస్సీ 2023 కి ఎంపిక కాబడిన అభ్యర్థులకు శుభాకాంక్షలు : జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.
ములుగు ప్రతినిధి : ఉపాధ్యాయ పోస్టులకు అర్హత పొందిన అభ్యర్థులు ఈనెల 5వ తేదీ లోగా వారి ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీ.ఎస్. గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లాలో 192 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి డీఎస్సీ పరీక్షల ద్వారా 576 మంది అర్హత పొందారని వీరిలో 1:3 ప్రకారం పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది,1:3 నిష్పత్తిలో ఎంపిక కాబడినటువంటి అభ్యర్థులకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరియు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు ఐదవ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించబడుతుందను, అర్హత పొందిన వారికి త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని సంప్రదించాలని ఆ ప్రకటనలో కలెక్టర్ కోరారు.