సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. 

సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. 

– వచ్చే సంవత్సరం నుండి ప్రవేశాలు ప్రారంభమని వెల్లడి.

– రానున్న రోజుల్లో పర్యాటక, ఎడ్యుకేషన్ హబ్ గా ములుగు. 

ములుగు తెలంగాణ జ్యోతి : మండలంలోని జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైై టి సి) లో సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపి కవితలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ములుగు గిరిజన ప్రాంతంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించడం చాలా సంతోషకరమని ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజనుల అక్షరాస్యత శాతం 49% శాతంగా ఉందని గిరిజన మహిళలో 39 శాతంగా ఉందని 100కు 100% గిరిజనులలో అక్షరాస్యత శాతం పెంచడమే ముఖ్య ఉద్దేశంగా గిరిజన యూనివర్సిటీని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కోసం 889.07 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని తెలంగాణ ప్రాంతంలో ఉన్నత విద్య యొక్క ప్రాముఖ్యత మరియు నాణ్యతను మెరుగు పరచడానికి ఇదొక సువర్ణ అవకాశమని తెలిపారు. 2024- 25 విద్యా సంవత్సరం నుంచి ప్రస్తుతం ఏర్పాటు చేసిన జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్లో రెండు కోర్సులతో తరగతులను ప్రారంభించడం జరుగుతుందని స్థానిక యువత యూనివర్సిటీలో ప్రవేశం కొరకు దరఖాస్తులు సమర్పించి ప్రవేశం పొందవలసిందిగా కోరారు. ఈ యూనివర్సిటీలో 35% ప్రత్యేకంగా గిరిజన విద్యార్థుల కోసం సీట్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్ల చేతుల మీదుగా భూమి పూజ చేయడానికి సన్నాహాలు చేయాలని యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో నిర్మాణ పనుల కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని ములుగు ప్రాంతం ముఖ్యంగా టూరిజం హబ్ గా మాత్రమే ఉందని యునివర్సిటీ ఏర్పడుతూ టూరిజం తో పాటు ఎడ్యుకేషన్ హబ్ గా ఏర్పడుతుందని అన్నారు. గిరిజన యూనివర్సిటీలో 35 శాతం సీట్లు గిరిజన విద్యార్థుల కోసం కేటాయించడం జరిగిందని వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్థానిక గిరిజన యువత ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ములుగు జిల్లా అనేక టూరిజం ప్రాంతాలతో ఉందని దేశం నలుమూలల నుంచి సందర్శకులు పర్యటకులు ఎక్కువ సంఖ్యలో వస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతం పై ఎక్కువ దృష్టి పెట్టి మరింత అభివృద్ధి చేయడం కోసం నిధులు మంజూరు చేయాలని తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని అన్నారు.మహబూ బాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత మాట్లాడుతూ ములుగు ప్రాంత ఆరాధ్య దైవాలుగా ఉన్న శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతల పేరు మీద యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. యూని వర్సిటీ ఏర్పాటుతో స్థానిక గిరిజన యువతకు విద్య ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పి షబరిష్, ఐటిడిఎ పిఓ చిత్ర మిశ్రా,అదనపు కలెక్టర్ సి హెచ్ మహేందర్ జి, మాజీ ఎం పి సీతారాం నాయక్, ఆర్ డి ఓ సత్య పాల్ రెడ్డి, తుకారాం పోరిక ( కంట్రోలర్ & ఎగ్జామినేషన్), డా. వంశీ కృష్ణ రెడ్డి ( ఓ ఎస్ డి ), హనుమంత రావు (యూనివర్సిటీ ఇంజనీరింగ్), డా. సంజయ్ కుమార్ శర్మ ( డైరెక్టర్ ఐ టి), అభిషేక్ కుమార్ ( డిప్యూటీ రిజిష్టర్),మహమ్మద్ అలీ బెగ్ ( స్తిస్టం అనాలసిస్ట్ ), సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.