కేంద్ర బడ్జెట్ అంకెల గారడిలా ఉంది
– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంకెల గారడీ లాగా ఉందని ఏటూరునాగారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘు ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీకి 8 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రాని కి కేంద్ర బడ్జెట్లో మొండి చేయి చూపడం దారుణమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్న, తెలంగాణ ప్రజలన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి మొదటి నుండి విపక్ష చూపుతుంద నడానికి ఈ బడ్జెట్ నిదర్శనమని తెలిపారు. తెలంగాణకు అన్ని రంగాలలో కేంద్ర బడ్జెట్ అన్యాయం చేసిందన్నారు. బడ్జెట్ రైలుకు అనేక ఇంజన్లు ఉన్నాయని దీంతో అది కాస్త పట్టాలు తప్పిందని అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం వంటి తీవ్రమైన సమస్యలు ఉండటంతో పాటు రోడ్లు నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు గురవు తున్నారని అన్నారు. నిరుద్యోగులు మహిళలు ఇలా అన్ని రంగాల వారికి మరోసారి కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కేవలం బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందున ఆ రాష్ట్రానికి బడ్జెట్లో పెద్దపీట వేయడం కచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమేనని అన్నారు. సిద్దిపేట జిల్లాలో రైలు రోడ్లు నిర్మాణానికి ఉపాధి రంగాల ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజలను మోసం చేసిందన్నారు. దేశంలో అధిక జనాభా కలిగి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే తమ జీవితాల్లో వెలుగులు నింపుతాయను కుంటే బిజెపి ప్రభుత్వం ప్రజలను మళ్లీ చీకటి లోకి నెట్టేలా బడ్జెట్ ఉందని అన్నారు. ఎన్నడూ లేనిది వ్యవసాయ రంగాలపై రైతులపై కేంద్ర ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తున్నదన్నారు. ఈ బడ్జెట్ సంపన్నులకు కొమ్ముకాసేలా ఉందని మండిపడ్డారు.