మంత్రి కాన్వాయి ని అడ్డగించిన గిరిజన రైతులు
– సాగునీళ్లు ఇవ్వాలని మంత్రిని కోరిన మాజీ సర్పంచి నర్సింహా మూర్తి..
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం వాగు ప్రాజెక్ట్ సాగు నీళ్లు బర్లగూడెం గ్రామపంచాయతీ లోని గిరిజన రైతుల ఆయకట్టు కు రావడం లేదని ఎన్నో ఏళ్లుగా రైతులు ఆందో ళన చెందుతున్నారు. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు నీళ్లు రాకపోవడం తో గిరిజన, గిరిజనేతర రైతులు వేసిన పంటలు ఎండి పోతాయేమో అనే భయం తో మనోవేదనకు గురి అవుతున్నారని మాజీ సర్పంచి కొర్స నర్సింహా మూర్తి రాష్ట్ర శిశు సంక్షేమ శాఖా, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి దనసరి అనసూయకు తెలిపారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి దనసరి అనసూయ వెంకటాపురం మండలాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకునేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచి కొర్స నర్సింహా మూర్తి రైతుల తో కలిసి తిరుగు ప్రయాణం లో ఉన్న మంత్రి కాన్వాయి ని సుమారు వందమంది గిరిజన రైతులు ఆరుగుంట పల్లి వద్ద ఆపి సాగు నీటి సమస్య గురించి వివరించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా పాలెం వాగు ప్రాజెక్ట్ సాగు నీళ్ళకు, బర్లగూడెం గ్రామపంచాయతీ రైతులు నోచు కోవడం లేదని మంత్రి దనసరి అనసూయ కు నర్సింహా మూర్తి వివరించారు. జెల్లా కాలని ఆరుగుంట పల్లి మధ్య ప్రధాన రహదారి మీద బ్రిడ్జి కట్టక పోవడం కారణంగానే సాగు నీళ్ళు రావడం లేదని తెలిపారు. సంబంధిత ప్రాజెక్ట్ అధికా రులను అడిగితె బ్రిడ్జి మంజూరు అయిందని కానీ గుత్తే దారు ముందుకు రావడం లేదని చెప్తున్నారని అన్నారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు ప్రధాన కాలువ అనేక చోట్ల గండ్లు పడిందని అన్నారు. గత ఏడాది కూడా ప్రాజెక్ట్ నీళ్ళు రాక సుమారు నాలుగు వేల ఎకరాల వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు ఎండి పోయి రైతులు తీవ్రంగా నష్ట పోయినట్లు నర్సింహా మూర్తి మంత్రి దనసరి అనసూయ కు చెప్పినారు. సాగు నీళ్ళు సకాలం లో అందివ్వక పోతే ఈ ఏడాది కూడా రైతులు నష్ట పోతారని అన్నారు. ప్రధాన రోడ్డు పైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రైతులు కోరారు. అందుకు రాష్ట్ర మంత్రి అనసూయ స్పందిస్తూ సంబంధిత అధికారులను ఆదేశించి సాగు నీళ్ళు సకాలం లో అందేలా చూస్తా మని రైతులకు హామీ ఇచ్చారు. రైతులు ఎటువంటి ఆందోళన చెంద వద్దని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమం లో రైతులు కుంజ పాపారావు, ఇర్ప బాబు, నారాయణ, సమ్మయ్య, సుధాకర్, బజారు తదితరులుపాల్గొన్నారు.