వన దేవతలను దర్శించుకున్న ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

వన దేవతలను దర్శించుకున్న ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

వన దేవతలను దర్శించుకున్న ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

– సమ్మక్క – సారలమ్మ జాతరకు రూ. కోటి మంజూరు చేయాలి

తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం : కన్నాయిగూడెం మండ ల కేంద్రానికి ఆమడ దూరంలో ఉన్నటివంటి ఐలాపూర్ గ్రామంలో సమ్మక్క, సారలమ్మ వనదేవతలను ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన ఐలాపూర్ గ్రామానికి నేటి వరకు అభివృద్ధి లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఐలాపూర్ ప్రతి ఇంటి కి పెంకులు ఇచ్చారన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్, పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ సీతక్క, ఐలాపూర్లో ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి ప్రజా సమ స్యలను వెంటనే తీర్చాలని కోరారు. అంతేకాకుండా ఫిబ్రవరి లో ఐలాపూర్లో జరిగే సమ్మక్క సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులకు వాటర్, తార్ రోడ్డు, గుడి ప్రాంగణంలో భక్తు లకు సేద తీర్చుటకు షెడ్లు, శ్రీ సమ్మక్క సారలమ్మ పూజా రులకు ప్రత్యేక రూములు ఏర్పాటు చేయాలని అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి నిధులను కేటాయిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట మేడారం డైరెక్టర్ పోడం శోభన్ తదితరులు పాల్గొన్నారు.