ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణంకు స్థలం ఎంపిక ప్రక్రియ ప్రారంభం. 

Written by telangana jyothi

Published on:

ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణంకు స్థలం ఎంపిక ప్రక్రియ ప్రారంభం. 

– ప్రభుత్వ స్థలాన్ని వేగవంతంగా గుర్తించాలని ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశం. 

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో 40 సంవత్సరాల పోరాట ఫలితంగా, ప్రభుత్వం నూతన జూనియర్ కళాశాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలలో తాత్కాలికంగా జూనియర్ కళాశాల తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అడ్మిషన్ ల ప్రక్రియ ప్రారంభం కాగా, సుమారు 50 మందికి పైగా విద్యార్థులు అడ్మిషన్ లు పొందారు. అలాగే ఇంటర్మీడియట్ బోర్డు వెంకటాపురం ప్రబుత్వ జూనియర్ కళాశాలకు 35 3 సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన జూనియర్ కళాశాలకు శాశ్వత భవనాలు ఇతర సౌకర్యాలు, క్రీడా ప్రాంగణం తదితర విద్యార్థుల అవసరాలకు, ప్రబుత్వ నిబంధనల ప్రకారం భవనాల నిర్మాణ కొరకు, వెంకటాపురం లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని ఉన్నతాధికారుల ఆదేశంపై వెంకటాపురం రెవెన్యూ శాఖ సర్వే ప్రారంభించింది. అయితే వెంకటాపురం పట్టణ నడిబొడ్డున శ్రీ కనకదుర్గమ్మ టెంపుల్ చౌరస్తా నుండి, ఏడిజర్లపల్లి మరియు, వాజేడు ఎస్. హెచ్ .12 ప్రధాన రహదారి పక్కనే దశిలీ పట్టు పరిశ్రమ శాఖకు చెందిన సుమారు 20 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. కాగా సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన శిథిలావస్థలో ఉన్న సెరికల్చర్ భవనాలు ఉన్నాయి. దశలిపట్టు పరిశ్రమ, పట్టు కాయల పెంపకం, తదితర అంశాలపై సుమారు అఇదారు దశాబ్దాలనుండి క్రితం ఏర్పాటు చేసిన సెరికల్చర్ కార్యాలయాలు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. అప్పటి ప్రభుత్వాలు రీలీంగ్ యూనిట్ , చేనేత , మద్ది చెట్ల పెంపకం, మల్భరి తోటలు , కొరకు సుమారు 20 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని సెరికల్చర్,దశిలిపట్టుపరిశ్రమ శాఖ కు కేటాయించింది. ప్రస్తుతం భారీ విస్తీర్ణంతో ఉన్న ఈ ప్రభుత్వ భూమి, భూమిలో రిజర్వ్ ఫారెస్ట్ ను తలపించే విధంగా పిచ్చి చెట్లు పెరిగి దర్శనమిస్తున్నాయి. దశీలి పట్టు పరిశ్రమపై గిరిజనులకు ఆసక్తి తగ్గిపోవడంతో వెంకటాపురం ప్రధాన కార్యాలయం కు సంబంధించిన అధికారులను, సిబ్బందిని దశాబ్దం క్రితంమే ఆ శాఖ ఉన్నతాధికారులు వేరే ప్రాంతానికి డిప్యూటేషన్ చేశారు. ప్రస్తుతం సుమారు 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి పిచ్చి చెట్లు పెరిగి నిరుపయోగంగా ఉంది. అయితే సెరికల్చర్ శాఖకు చెందిన ఈ భూమిని ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో, ఈ స్థలాన్ని వెంకటాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కొంత భాగం కేటాయించాలని గ్రామస్తులు, రాజకీయ పార్టీల ప్రముఖులు, గిరిజన సంఘాలు విద్యార్థి సంఘాలు ములుగు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. టెస్సార్ సెరికల్చర్ స్థలం పక్కనే బీ.సీ. మర్రిగూడెం జి.పి కి చెందిన సుమారు ఎకరం విస్తీర్ణంలో ఉన్న క్రీడా ప్రాంగణం తో పాటు, రెండు ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న పల్లె ప్రకృతి వనం పూల గార్డెన్ లు ఉన్నాయి. అంతేకాక కస్తూర్బా గాంధీ పాఠశా భవనాల సముదాయం, సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో,నిర్మించిన భవనాలు సమీపంలో వున్నాయి. కెవిజివిబి ఆధ్వర్యంలో బాలికల జూనియర్ కళాశాల ను నిర్వహిస్తున్నారు. అంతేకాక సెరికల్చర్ స్థలం పక్కనే మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు ఈ ప్రాంతానికి హెలికాప్టర్ పై సందర్శించేందుకు, వచ్చేందుకు హెలిపాడ్ ను సైతం ప్రభుత్వం పదేళ్ల క్రితమే ఏర్పాటు చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న సుమారు 20 ఎకరాల విస్తీర్ణం తో ఉన్న సెరికల్చర్ శాఖ స్థలంలో ఏఎంసి ప్రక్కన సుమారు 5 ఎకరాలు ను ప్రభుత్వ జూనియర్ కళాశాల కేటాయించాలని, ములుగు జిల్లా కలెక్టర్ కు ప్రజలు విన్నవిస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ ప్రభుత్వ స్థలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు కు రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, అనేక సౌకర్యాలు కలిగిన ఈ స్థలాన్ని జూనియర్ కళాశాలకు కేటాయిస్తే తరతరాలు చిరస్థాయిగా ఉంటుందని ప్రజల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే స్థలానికి ఎదురుగా సుమారు 20 ఎకరాల ప్రబుత్వ సాగు నీటి బోడి చెరువు ఉంది. అంతేకాక శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం తో పాటు ,నూగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ విశాలమైన విస్తీర్ణంతో ఉన్న ప్రాంగణం కలిగి ఉన్నాయి. ఇంత సౌకర్యంవంతమైన దశలి పట్టు పరిశ్రమ శాఖ కు చెందిన ప్రభుత్వ స్థలాన్ని జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి కేటాయించాలని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే వెంకటాపురం మండలానికి గత ఏడాది గిరిజన గురుకుల పాఠశాల మంజూరు కాగ ప్రభుత్వ స్థలం, భవనాలు లేకపోవడంతో, గురుకుల పాఠశాలను తాత్కాలికంగా వాజేడు మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. నిరుపయోగంగా ఉన్న సెరికల్చర్ స్థలంలో గురుకుల పాఠశాలకు కూడా కొంత విస్తీర్ణం భూమిని కేటాయించాలని, భవిష్యత్తులో డిగ్రీ కళాశాల కు కూడా ఇదే ప్రాంగణంలో నిర్మాణాలు జరిగే అవకాశం ఉందని, భవిష్యత్ విథ్యా తరాలకు, ఉన్నత విద్య, పట్ట భథ్ర విద్య, ఇతర సాంకేతిక విద్యలకు, ఒకే ప్రాంగణంలో శ్రీ సరస్వతి దేవి నిలయంగా తరతరాలు ఎడ్యుకేషన్ హబ్ ప్రాంగణం గా భాసిల్లుతుందని ,ప్రజల్లో గట్టిగా అభిప్రా యం వ్యక్తం అవుతున్నా ఇ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న వెంకటాపురం, వాజేడు మండలాలు 2014లో జయశంకర్ భూపాల జిల్లాలో విలీనం చేశారు. తదుపరి రెండోసారి అదికారం లోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం నూతనంగా ములుగు జిల్లా ను ఏర్పాటుచేసి వెంకటాపురం, వాజేడు మండలాలను ములుగు జిల్లాలో విలీనం చేశారు. అయితే ఫిఫ్త్ షెడ్యూల్డ్ అమల్లో ఉన్న వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం ఐటిడిఏ పరిధిలో కొనసాగుతున్నది. ప్రభుత్వపరమైన, గిరిజన పాలనాపరమైన, విధి విధానాల్లో భాగంగా భద్రాచల ఐటీడీ ఏ ఉన్నతాధికారులతో, వెంకటాపురం గిరిజన ప్రాంతానికి 40 ఏళ్ల తర్వాత మంజూరైన జూనియర్ కళాశాల కు సెరికల్చర్ స్తలంలో కొన్ని ఎకరాల స్థలాన్ని కేటాయించే విధంగా, ములుగు జిల్లా కలెక్టర్, భద్రాచలం ఎమ్మెల్యే, మహబూబాబాద్ పార్లమెంటు గౌరవ సభ్యులు, ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకోవాలని, వెంకటాపురం మండల ప్రజలు పత్రికా ముఖంగా ముక్త కంఠంతో, ప్రజాప్రతినిధులు కు , ములుగు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now