ప్రైవేటు ఉపాధ్యాయుల సేవలు అద్భుతం
– ఎన్హెచ్ఆర్సీ రాష్ర్ట అధ్యక్షుడు మొగుళ్ల భద్రయ్య
– ఉత్తమ ప్రైవేట్ ఉపాధ్యాయులకు సన్మానం
ములుగు ప్రతినిధి : ఉన్నత విద్యను అభ్యసించి ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా కొలువుచేస్తూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ర్ట అద్య క్షుడు మొగుళ్ల భద్రయ్య, ములుగు ఎంఈవో సామల శ్రీనివా స్ అన్నారు. మంగళవారం ఎన్హెచ్ఆర్సీ ములుగు జిల్లా అధ్య క్షుడు పెట్టెం రాజు అధ్యక్షతన ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యా య వృత్తిని నమ్ముకొని నిస్వార్ధంగా సేవలందిస్తున్న ఉపాధ్యా యులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. గౌరవ అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, ముఖ్యఅతిథిగా స్థానిక ఎంఈఓ సామల శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యంగా భావించి చాలీచాలని జీతాలతో ప్రైవేటు ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకున్న ప్రైవేటు ఉపాధ్యాయులు అభినందనీయులని అన్నారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే క్రమంలో డ్రగ్స్ రహిత సమాజం కోసం కూడా కృషి చేయాలని ఉద్బోధించారు. డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మాట్లాడుతూ దీర్ఘకాలం ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను సన్మాంచే కార్యక్రమం 33జిల్లాల్లో నిర్ణయించామని, ఈ కార్యక్రమాన్ని ములుగు జిల్లా నుంచి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో పోటీగా ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా తీవ్రంగా విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లకు విజ్ఞప్తి చేశారు. ఎంతో ఉద్వేగపూరిత వాతావరణంలో గౌరవ సన్మానం తీసుకున్న ఉపాధ్యాయులు వారి యొక్క అనుభవాలను పంచుకున్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు సముద్రాల మధుసూదనా చారి, భూక్య సమ్మయ్య, లావుడియా రాజు, గొట్టే రమేష్, ముప్పు పూర్ణిందర్, గడ్డం సారంగపాణి, మాడూరి శ్రీనివాస్, దొంతిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఇమ్రాన్ ఖాద్రి, బలుగూరి జనార్ధన్ తదితరులను ప్రశంసా పత్రం, జ్ఞాపిక, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఈసీ సభ్యులు జి.సంజీవ, ములుగు పట్టణ అధ్యక్షులు కోడిపాక రవి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.