అధికార పార్టీ అండతో రెచ్చి పోతున్న ఇసుక మాఫియా.
– భయభ్రాంతులకు గురి అవుతున్న ప్రయాణికులు.
– మాజీ ఎంపీపీ డాక్టర్ జాడి రామరాజు నేత
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : అధికార పార్టీ అండతో ఇసుక మాఫియా రెచ్చిపోవడంతో ప్రజలు, ప్రయాణికులు భయ భ్రాంతులకు గురవుతున్నారని భారతీయ జనతా పార్టీ కిషోర్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ డాక్టర్ జాడీ రామరాజు నేత అన్నారు. ఏటూరు నాగారం రొయ్యూరు గ్రామపంచాయతీ పరిధిలో అధికార పార్టీ అండతో పట్ట ల్యాండ్ పేరు చెప్పుకొని ఇసుక మాఫియా రెచ్చిపోతూ నేషనల్ హైవేకు ఇరువైపులా లారీలు పెట్టుకోవడం వలన ప్రయాణికులు ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని పోవాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా విచ్చల విడి గా అధికార పార్టీ అండ చూసుకొని పట్టా ల్యాండు పేరుతో ఇసుక తీసుకోవడం మంచిదే, కానీ ప్రజల ప్రాణాలకు రక్షణ ఎవరో అధికార పార్టీ నాయకులు గానీ సంబంధిత అధికారులు చెప్పాలన్నారు. అదేవిధంగా ప్రకృతి వికటించి వర్షాలు వర్షాలు పడితే ఏటూరునాగారం కనుమరుగయ్యే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఏటూరు నాగారం గ్రామపంచాయతీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే పట్టా ల్యాండ్ పేరుతో విజృంభిస్తున్న వారి పైన సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒకవేళ ల్యాండ్ కు పర్మిషన్ ఉంటే పట్టా ల్యాండ్ లోనే లారీలను పెట్టుకొని ఇసుక తోలుకోవచ్చు. కానీ రోడ్డుకు ఇరువైపులా పెట్టుకొని ఇసుక తీయడం వలన ప్రయాణికులకు ఆక్సిడెంట్ అయి ప్రాణాలు కోల్పోతే బాధ్యులు పట్టా ల్యాండ్ వాళ్లు వర్తిస్తారా లేక సంబంధిత అధికారులకు వర్తిస్తదో ముందు చెప్పాలని భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ డాక్టర్ జాడి రామరాజు నేత అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్డు ఇరువైపులా ఉన్న లారీలను తొలగించి ల్యాండ్ లోనే పెట్టుకునే విధంగా చూసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని అన్నారు.