ప్రైవేట్ స్కూల్స్ లలో నోట్ బుక్స్ దందాను అరికట్టాలి
– ఎం.ఈ.ఓ రత్నమాల కి ఏ.ఐ.ఎస్.బి వినతి
తెలంగాణ జ్యోతి, నర్సంపేట : అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి నర్సంపేట , నెక్కొండ ఖానాపురం చెన్నారావు పేట పరిధి లోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమా న్యాలు విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లక్షల రూపాయల ఫీజులను వసూలు చేస్తూ పాఠశాల ఆవరణలో పాఠ్యపుస్తకాలు విక్రయిస్తూ విద్యార్థులను నిలువ దోపిడి చేస్తున్న విద్యాసంస్థలను పై చర్యలు తీసుకోవాలని ఏ.ఐ.ఎస్.బి నర్సంపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఏం. ఈ .ఓ రత్నమాల కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సంపేట డివిజన్ కన్వీనర్ పూర్ణచందర్ మాట్లాడుతూ నర్సంపేట డివిజన్ పరిధిలో ఉన్నటువంటి విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులకు నిలువ దోపిడీ చేస్తూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ విద్యా ను అంగడి సరుకు మాదిరిగా మార్చేశాయి ఆయన ఆరోపించారు తక్షణమే నర్సంపేట , చెన్నారావుపేట నెక్కొండ ఖానాపురం పరిధిలో ఉన్నటువంటి ప్రవేట్ విద్యాసంస్థలలో సాగుతున్న పాఠ్య పుస్తకాల దందా ను అరికట్టాలని వారు ఎంఈఓ కి వినతిపత్రంలో కోరారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ వినతిపత్రం ఇచ్చిన వారిలో జాతోటు గణేష్ తదితరులు ఉన్నారు