రాజ్యాంగ బద్దంగ ఆదివాసులకు కల్పించిన హక్కులను పాలక ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలి

రాజ్యాంగ బద్దంగ ఆదివాసులకు కల్పించిన హక్కులను పాలక ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలి

రాజ్యాంగ బద్దంగ ఆదివాసులకు కల్పించిన హక్కులను పాలక ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలి

– టీ.బీ .ఏ .ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచంద్ర రావు డిమాండ్.  

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో బుదవారం కాపెడు గ్రౌండ్ ప్రాంగణంలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం టీ.బీ. ఎ .ఎస్. ఆధ్వర్యంలో ఆదివాసి హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు.ముందుగా ఆదివాసి పోరాట యోధు ల చిత్ర పటాలకు పూలమాలు వేసి వాసం లక్ష్మయ్య, గొంది శేషగిరిరావు గ్రామ పెద్దలు కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించా రు.అనంతరం ఆదివాసి హక్కులు చట్టాలపై అవగాహన సద స్సును నిర్వహించారు.తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచంద్ర రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆదివాసీల హక్కులు చట్టాలపై ఆదివాసీ యువతకు వివరించడం జరిగింది. ప్రతి ఆదివాసి యువతీ, యువకులు ఆదివాసి సమాజంపై హక్కులు చట్టాల పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అలాగే పాలక ప్రభుత్వాలు ఆదివాసులకు చేసే మోసాన్ని తెలుసుకొని ఆదివాసి ప్రజలు చైతన్య వంతులు కావాలని ఆయన అన్నారు. భారత రాజ్యాంగంలో ఆదివాసీలకు 5,6 షెడ్యూల్లో కల్పించినటువంటి హక్కులను పాలక ప్రభుత్వా లు అమలు పరచకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అధికా రులు ఐటిడిఏ పిఓ, జిల్లా కలెక్టర్ లు ఆదివాసి చట్టాలను పటిష్టంగా అమలు జరిగే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు. 1/59, 1/70 ఎల్ టి ఆర్ భూ బదలాయింపు నిషేధిత చట్టాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉల్లంఘన జరుగుతున్నదని, దినికి ప్రధాన కారణం బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఆది వాసీలు గెరిల్లా లాంటి ఉద్యమ పోరాటాలు చేసి సాధించిన చట్టాలను ఉల్లంఘన జరుగుతుంటే, ఆదివాసి ప్రజలు చైతన్య వంతులై వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని హితవు పలికారు. ఈ సమావేశంలో పూనెం మునేశ్వరరావు, ములుగు జిల్లా కన్వీనర్ చింత సోమరాజు, తుడుం దెబ్బ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు తాటి నరసింహారావు, సీనియర్ నాయకులు తాటి లక్ష్మణ్, మండల అధ్యక్షులు కోరం ప్రసాద్ మండల ప్రధాన కార్యదర్శి పూనెం నాగరాజ్, మండల ఉపాధ్య క్షులు మద్ద నర్సింలు, వాజేడు మండల అధ్యక్షులు మడకం గణేష్, వాజేడు మండల ప్రధాన కార్యదర్శి కారం సందీప్, వాజేడు మండల ఉపాధ్యక్షులు గుర్రం సాయి, మండల కార్య దర్శి పూణే ఉషారాణి, గుడ్డే స్వరూప, ఇరుప లక్ష్మి, వాసం రాధ, పూనెం సాయి చరణ్, పవన్ కుమార్ ,జజ్జరి మల్లయ్య, యాలం సుధాకర్, మడకం సమ్మయ్య, పోడం రాజేష్, మండల కార్యదర్శి వాసం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment