నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

– కాళేశ్వరం ఎస్సై భవాని సేన

కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కు వినియో గించుకోవాలని కాలేశ్వరం ఎస్సై భవాని సేన్ అన్నారు. సోమ వారం మహాదేవపూర్ మండలంలోని బిరాసాగర్ గ్రామంలో ఎస్సై భవాని సేన్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామంలోకి కొత్త అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అనంతరం గ్రామాల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గుడుంబా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల కోసం కోసం విద్యుత్ వైర్లు అమర్స్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్ర మంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.