అంగరంగ వైభవంగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఊరేగింపు
– భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలంలో దసరా పండుగ సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రుల మహో త్సవాలు తొమ్మిది రోజులు పాటు ఉత్సవ కమిటీలు ఘనంగా నిర్వహించారు. శనివారం దసరా పండుగ పర్వదినం కావ డంతో శ్రీ కనకదుర్గమ్మ తల్లి ప్రత్యేక పూజలు అందుకున్నారు. ఆదివారం నవరాత్రి కమిటీలు వారి, వారి మండ పాల వద్ద శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెళ్లి రావమ్మ తల్లి, చల్లంగా చూడమ్మ తల్లి పాడి పంటలు సక్రమంగా పండాలని అందరు సుఖంగా జీవించాలని, తల్లి అంటూ సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్లలో వెంకటాపు రం, వాజేడు పట్టణ పురవీధులలో ఆదివారం సాయంత్రం నుండి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్త సోదరిమణులు, కోలాటాలు భక్తి రస గీతా లతో అమ్మవారి వాహనానికి ముందుగా స్వాగతం పలు కుతూ భక్తురస కార్యక్రమాల్లో డీజే పాటలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వెంకటాపురం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం, రజక వీధి, శివాలయం వీధి, పాత మార్కెట్ సెంటర్ లతో పాటు అనేక గ్రామాల్లో అమ్మవారి నిమజ్జన కార్య క్రమాలను రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగించారు. అమ్మ వారినీ పురవీధులలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించగా ప్రధాన రహదారి కి ఇరువైపుల ఉన్న గృహస్తులు శుద్ధి జలం తో స్వాగతం పలికి టెంకాయ పసుపు, కుంకాలతో ఆశీర్వ దించమ్మా, కనకదుర్గమ్మ తల్లి అందరినీ చల్లగా చూడమం టూ పూజలు నిర్వహించి సాగనంపారు. అమ్మవారి విగ్రహాల ను బల్లకట్టు వాగుతో పాటు, గోదావరి లో నిమజ్జనం కార్యక్ర మాన్ని ఉత్సవ కమిటీలు ఆదివారం రాత్రి పొద్దుబోయే వరకు కొనసాగించారు.