మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి
మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి
– 32 మందితో కూడిన జాబితా విడుదల
ములుగు ప్రతినిధి : ములుగులోని ప్రభుత్వ వైద్య కలశాల లో పనిచేసేందుకు వివిధ విభాగాములలో ఇచ్చిన పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిందని ప్రిన్సిపల్ బి.మోహన్ లాల్ తెలిపారు. ఔట్ సోర్సంగ్ ప్రాతిపదికన 32 పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు స్వీకరించగా ఎంపికైన వారి జాబితా శనివారం విడుదల చేశారు. సెలక్షన్ కమిటీ ద్వారా పరిశీలించి మెరిట్, వయసు, అనుభవము మరియు రోస్టర్ (రూల్ ఆఫ్ రిజర్వేషన్) అమలు పరచి జాబితా తయారు చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఈ జాబితా నుంచి మొదటి విడతగా 32 మందిని ఎంపిక చేశామని, జాబితాని జిల్లా పోర్టల్లో, కలెక్టర్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి నోటీసు బోర్డులోని కాని చూసుకోవచ్చన్నారు. ఈ విడుతలో పేరు లేనివారు నిరుత్సాహ పడవలసిన అవసరం లేదని, త్వరలో ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్న