జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.

Written by telangana jyothi

Published on:

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.

– మంత్రికి వినతి పత్రం అందజేసిన ములుగు జిల్లాప్రెస్ క్లబ్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు. 

ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా జర్నలిస్టుల సమస్య లను పరిష్కరించాలని ములుగు జిల్లా ప్రెస్ క్లబ్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మంగళవారం మంత్రి సీతక్క కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎనగం దుల కొమురయ్య మాట్లాడుతూ జిల్లాలోని విలేక రులు గత 15 సంవత్సరాలుగా ఇళ్లు,ఇళ్ల స్థలాల కోసం వేచి చూస్తు న్నారని, గత రెండు సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు జర్నలి స్టులకు సానుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వం ఇంటి స్థలాలను ఇవ్వక పోవడంతో నిరాశ చెందామన్నారు. డిసెంబర్ లో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులలో మళ్ళీ ఆశలు చిగురిం చాయని, ములుగు జిల్లా,మండల కేంద్రాలలో పనిచేస్తున్న పాత్రికేయు లకు ఇల్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, అక్రెడిటేషన్లతో సంబంధం లేకుండా జే.హెచ్.ఎస్ పథకం కింద అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేసి ప్రభుత్వ, ప్రైవేటు, కార్పోరేట్, మల్టీ స్పెషా లిటీ ఆసుపత్రులన్నింటిలోనూ క్యాష్ లెస్ వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని కోరారు. మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ పథకాలలో వివిధ కులాలకు చెందిన విలేకరులకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా పథకాలను వర్తింపచేసేలా చూడాలన్నారు. జనవరి నెలలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ సమీపంలో ప్రెస్ క్లబ్ కోసం భూమి పూజ చేసిన స్థలంలో భవనాన్ని వెంటనే నిర్మించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. గతంలో అక్రిడిటేషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు ఇప్పటివరకు అక్రిడిటేషన్లు మంజూరు చేయలేదని, అర్హులైన వర్కింగ్ జర్నలిస్టు లకు తక్షణమే అక్రిడిటేషన్లను అందించేలా జిల్లా కలెక్టర్, డిపిఆర్ఓ లకు ఆదేశాలు ఇవ్వాలని, ములుగు జిల్లా ప్రెస్ క్లబ్ అండ్ వెల్ఫేర్ సొసైటీ తరపున మంత్రికి వినతిని అందజేశామని తెలిపారు. ఈ విషయం పై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఉపాధ్యక్షుడు చుంచు రమేష్, జాయింట్ సెక్రటరీ ఆలుగొండ రమేష్, కోశాధికారి సంఘ రంజిత్, కమిటీ మెంబర్లు ఆవుల వెంకన్న, చల్లగురుగుల రాజు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment