ఎడపల్లి పిఎస్ స్కూల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : భారత విద్యార్థి ఫెడరే షన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎడపల్లి గ్రామంలోని పిఎస్ స్కూల్ ను సందర్శించి సర్వే చేయడం జరిగింది. అనంతరం వారు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 28 మంది విద్యార్థులకు ఒకరే టీచర్ ఉన్నారని ఖాళీగా ఉన్న ఉపా ధ్యాయ పోస్టుల ను వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు నాణ్య మైన విద్యను అందించాలని అలాగే వాష్ రూమ్స్ మరియు వాటర్ సమస్య తీవ్రంగా ఉందని ఎంఈఓ పర్యవేక్షణ లేకపోవడం వలనే అనేక సమస్యలు అని తక్షణమే ఎంఈఓ మరియు డి ఈ ఓ స్పందించి స్కూల్లో ఉన్నటువంటి సమ స్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్ ఎఫ్ ఐ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజు కుమార్ కోరారు.